అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రజలను మురుగు కష్టాలు వెంటాడుతున్నాయి. చిన్నపాటి వర్షానికే.. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమై.. రోడ్లపై మురుగు ప్రవహిస్తోంది. ప్రతి ఏటా డ్రైనేజీల నిర్వహణకు.. లక్షల్లాది రూపాయలు వెచ్చించినా.. పనులు చేపట్టడంలో మాత్రం అధికారులు అలసత్వం వహిస్తున్నారు. అనేక కాలనీల్లో మురుగునీరు ఇళ్లల్లోకి చేరి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయటం వల్ల దుర్వాసన వ్యాపిస్తోంది. కరోనాకి తోడు వర్షాకాలం కావడంతో.. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పురపాలక అధికారులు చెత్తను సేకరించి.. మురుగు నీటి వ్యవస్థను బాగు చేయాలని కోరుకుంటున్నారు.
ఇదీ చదవండీ.. Covid Vaccine: రాష్ట్రానికి చేరుకున్న మరో 4.08 లక్షల కొవిడ్ టీకా డోసులు