Narasimha Swamy rathotsavam: రెండేళ్ల తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో అనంతపురం జిల్లా పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో క్షేత్రం మారుమోగింది. గోవింద నామస్మరణ నడుమ పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం సాయంత్రం కనులపండువగా సాగింది. ఉత్సవ విగ్రహాలను అలంకరించి రథంలో కొలువుదీర్చారు.
ఉదయం మడుగుతెరు అనంతరం సాయంత్రం ప్రత్యేక పూజల చేసి రథాన్ని లాగారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. రెండేళ్ల తర్వాత ఉత్సవాలు నిర్వహించడంతో.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా వచ్చారు. ఉదయం మూలవిరాట్‌కు ప్రత్యేకపూజలు, అభిషేకాలు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాల ద్వారా ఉరవకొండ సీఐ శేఖర్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వేడుక ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: