రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు తీసుకువచ్చిన 10 శాతం రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నా.. ఏపీలో వైకాపా ప్రభుత్వం అమలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని కారణంగా అర్హులైన వారు నష్టపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తక్షణమే రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఇదీ చదవండి: 'విధులకు మేం హాజరుకాము.. వచ్చే వారితోనే చేయించుకోండి'