ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయచ్చని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. నగరంలోని పాతూరులో ఉన్న కూరగాయల మార్కెట్, చెరువుకట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్లను... ఎమ్మెల్యే పరిశీలించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. కూరగాయల దుకాణాల మధ్య తప్పనిసరిగా దూరం పాటించాలని సూచించారు. వర్షం కారణంగా పరిసర ప్రదేశాలు చిత్తడిగా ఉండడంతో తక్షణం పరిశుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తప్పనిసరిగా సమయపాల పాటించాలని హెచ్చరించారు.
ఇదీ చదవండి: నా పార్టీ పేరును వైకాపా వాడుకుంటోంది: మహబూబ్ బాషా