ETV Bharat / state

ఆ గుడి కోసం పరిటాల కుటుంబం ఆందోళన

అనంతపురం జిల్లాలో ఓ ఆలయం వ్యవహారంలో దుమారం రేగుతోంది. రామగిరి మండలంలో తాము అభివృద్ధి చేసిన గుడిని... దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పరిటాల కుటుంబం ఆరోపిస్తోంది. రెండున్నర దశాబ్దాలుగా ఆ అలయాన్నే నమ్ముకుని బతుకుతున్న తమకు ఇబ్బందులు తప్పవని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

partala family oppose government over take on ramagiri temple
గుడి కోసం పరిటాల కుటుంబం ఆందోళన
author img

By

Published : Dec 16, 2019, 5:40 PM IST

గుడి కోసం పరిటాల కుటుంబం ఆందోళన

అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోటలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని పరిటాల రవీంద్ర కుటుంబం అభివృద్ధి చేసింది. రవీంద్ర మరణానంతరం ఆయన కుటుంబసభ్యులు ఆలయ అభివృద్ధి బాధ్యతలు చేపట్టారు. సమీప గ్రామాలకు చెందిన 18 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద దాదాపు 500 మంది చిరువ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. ఈ ఆలయంపై వచ్చే సొమ్మును రామగిరి మండలంలోని పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పరిటాల కుటుంబం ఆరోపిస్తోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఆలయంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్థానిక చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన చెందుతున్నారు.

ఆలయాన్ని తమకు అప్పగించాలని దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి ముత్యాలమ్మ ఆలయ కమిటీకి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

ఇదీ చదవండి

'ఉజ్జయిని' టూ 'శబరిమల'.. అయ్యప్ప భక్తుడి పాదయాత్ర

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.