ETV Bharat / state

కళ్యాణదుర్గంలో ఘనంగా పరిటాల రవి జయంతి - ananthapur district latest news

కళ్యాణదుర్గం, నార్పలలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 63వ జయంతి వేడుకలను అభిమానులు ఘనంగా జరిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యాలయానికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్​ కట్​ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

paritala birth anniversary celebrations in ananthapur district
కళ్యాణదుర్గంలో ఘనంగా పరిటాల రవీంద్ర జయంతి వేడుకలు
author img

By

Published : Aug 30, 2020, 4:42 PM IST

కళ్యాణదుర్గం ఎన్టీఆర్​ భవన్​లో మాజీ కార్మిక శాఖ మంత్రి పరిటాల రవీంద్ర జయంతి వేడుకలను తెదేపా నేతలు ఘనంగా జరిపారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరై పరిటాల చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్​ కట్​ చేశారు. జిల్లాలో బడుగు బలహీన వర్గాల కోసం ఆయన దూకుడుగా తీసుకున్న నిర్ణయాలు చిరస్మరణీయమని తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. కార్యకర్తల గుండెల్లో నేటికీ నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు.

నార్పల మండలంలో తెలుగు యువత ఆధ్వర్యంలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 63వ జయంతి వేడుకలను జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్​ కట్​ చేశారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలుగు యువత నాయకులు తెలిపారు.

ఇదీ చదవండి :

పరిటాల రవికి చంద్రబాబు, నారా లోకేష్ నివాళులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.