ETV Bharat / state

పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు - ananthapuram district newsupdates

రూపాయి రాక.. పోక.. పన్నుల పెంపు, పన్నేతర ఆదాయం, పెట్టుబడులు,అప్పులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్​లో ఈ పదాలు కనిపిస్తాయి. ప్రభుత్వ పెత్తనం లేకుండా స్వేచ్ఛాయుత పరిపాలనకు అవకాశం కల్పిస్తేనే ఇది సాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Panchayats are funded by the Central and State Governments
పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు
author img

By

Published : Feb 11, 2021, 3:45 PM IST

Updated : Feb 11, 2021, 4:17 PM IST

కేంద్ర బడ్జెట్టైనా.. గ్రామ పద్దు అయినా ఒక్కటే తీరు. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే అసలైన అభివృద్ధి అని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు. వాటి ప్రగతికి సొంత ఆదాయ వనరులతో పాటు ప్రభుత్వాల చేయూత తప్పనిసరిగా ఉండాలి. రెండింటినీ సక్రమంగా, సమర్థంగా వినియోగిస్తేనే పల్లెలు ప్రగతి పథంలో పరుగులు తీస్తాయి. ప్రభుత్వ పెత్తనం లేకుండా స్వేచ్ఛాయుత పరిపాలనకు అవకాశం కల్పిస్తేనే ఇది సాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంచాయతీలకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది. ఖర్చుకు సంబంధించిన లెక్కలు చూపాల్సిందే.

ఉపాధి నిధులు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తోంది. కూలీల పనిదినాలకు గాను చేసిన ఖర్చులో 40 శాతం నిధులు వెనక్కి వస్తాయి. వీటితోపాటు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు మేజర్‌ పంచాయతీలకు 70 శాతం, మైనర్‌ పంచాయతీలకు 90 శాతం నిధులు మంజూరు చేస్తారు. పంచాయతీలు తమ వాటా చెల్లిస్తేనే ఈ నిధులు విడుదల చేస్తారు.

ప్రోత్సాహకాలు..

ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పురస్కారాల పేరుతో ప్రత్యేక నగదు బహుమతులు అందిస్తున్నాయి. వీటిద్వారా గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుంది. పంచాయతీలకు కేంద్రం నుంచి జనాభా ఆధారంగా మనిషికి రూ.450 చొప్పున నిధులు విడుదల చేస్తారు. గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలు, తాగునీటి పథకాల నిర్వహణ, పైపులైన్ల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులకు ప్రధానంగా వినియోగిస్తారు.

కేంద్ర సాయం..

దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులు కేటాయిస్తారు. ఈ నిధులు అందాలంటే కచ్చితంగా పాలకవర్గం కొలువై ఉండాలి. ప్రత్యేక అధికారుల పరిపాలన ఉంటే నిలిపివేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. 2018 ఆగస్టు తర్వాత పాలకవర్గాలకు ఎన్నికలు జరగకపోవడం వల్ల ఈ నిధులు రాలేదు. అయితే కరోనా సమయంలో ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి మంజూరు చేశారు. ఈక్రమంలో జిల్లాకు 2019-20 సంవత్సరానికి గాను 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.97 కోట్లు కేటాయించారు. మరోవైపు జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక్కో పంచాయతీకి ఏటా రూ.10 వేలు అందిస్తున్నారు.

రాష్ట్ర సహకారం..

రాష్ట్ర ఆర్థిక సంఘం సిపార్సుల మేరకు జనాభా ప్రాతిపదికన నేరుగా పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు, వ్యాపార సంస్థల నుంచి వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో వసూలు చేసే వృత్తి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో దాదాపు 95 శాతం పంచాయతీలకే కేటాయిస్తారు. వినోద పన్ను రూపంలో వసూలైన మొత్తాన్ని 60ః40 నిష్పత్తి రూపంలో చెల్లిస్తారు. పంచాయతీ పరిధిలోని గనుల తవ్వకాలపై సీనరేజీ రూపంలో వచ్చిన ఆదాయాన్ని 25 శాతం చొప్పున కేటాయిస్తారు. అలాగే ఒక్కో మనిషికి రూ.4 చొప్పున తలసరి గ్రాంటు అందిస్తారు. పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమైతే ప్రోత్సాహం కింది భారీ మొత్తంలో నిధులు ఇస్తారు.

ఖర్చులు ఇలా..

గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని నిర్ధిష్ట ప్రమాణాల మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పంచాయతీలు చేసే వ్యయాల్లో ప్రధానంగా సిబ్బంది వేతనాలకు 30 శాతం కేటాయిస్తున్నారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యానికి 15 శాతం, వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణకు 15 శాతం, రక్షిత మంచినీటి సరఫరాకు 15 శాతం, రహదారులు, డ్రైనేజీ నిర్మాణానికి 20 శాతం, ఇతరత్రా వాటికి మరో 5 శాతం నిధులు ఖర్చు చేస్తున్నారు.

ఆదాయ మార్గాలెన్నో..

పన్నులు: గృహాలు, కొళాయిలు, ప్రకటనలు, ప్రత్యేక పన్నులు.

ఐచ్ఛిక పన్నులు: ఖాళీ స్థలాలపై, డ్రైనేజీలు, నీటి తీరువా.

రుసుములు: లైసెన్సు ఫీజు, ఆక్రమణలపై, లేఅవుట్‌ అనుమతులు, భవన నిర్మాణాలు, అపరాధాలు, మార్కెట్లు, దేవాదాయం.

వేలం: వారపు, రోజువారీ సంతలు, చేపల చెరువులు, ఫలసాయం, కంపోస్టు, పోరంబోకు భూములు.

ఇదీ చదవండి:

సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ సమావేశం

Last Updated : Feb 11, 2021, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.