జీవో నెం.2ను ఉపసంహరించుకోవాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం.. పంచాయతీరాజ్ పరిధిలోని 29 అంశాలు కార్యదర్శుల పరిధిలో ఉంటాయని స్పష్టం చేశారు. వీటిని రెవెన్యూశాఖకు చెందిన వీఆర్వోలకు ఎలా బదలాయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
వీఆర్వోల హర్షం:
డీడీఓ బాధ్యతలను తమకు అప్పగించడం పట్ల వీఆర్వోల సంఘంహర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమకు అప్పగించిన విధులను అంకితభావంతో నెరవేరుస్తామని సభ్యులు పేర్కొన్నారు.
ఇదీ జరిగింది:
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీవో 2.. రెండు శాఖల మధ్య సమన్వయానికి విఘాతం కలిగించేలా ఉంది. పంచాయతీల పరిధిలో డ్రాయింగ్, పంపిణీ అధికారి బాధ్యతలను కార్యదర్శుల నుంచి వీఆర్వోలకు బదలాయిస్తూ ఆదేశాలు విడుదలయ్యాయి. ఈ నిర్ణయమే కార్యదర్శులు, వీఆర్వోల మధ్య దూరం పెరగడానికి కారణమవుతోంది. ఈ పరిణామాలు పథకాల అమలుపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
ఇదీ చదవండి: