ETV Bharat / state

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్​ ప్రారంభం - హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వార్తలు

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్​ ప్లాంట్​ను మంత్రి శంకర్​ నారాయణ ప్రారంభించారు. ప్రాణవాయువు కొరత తీర్చేందుకు ఈ ప్లాంట్​ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.

oxygen plant
ఆక్సిజన్ ప్లాంట్​ ప్రారంభ కార్యక్రమం
author img

By

Published : May 27, 2021, 10:44 AM IST

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్​ ప్లాంట్​ను మంత్రి శంకర్​ నారాయణ ప్రారంభించారు. ఆక్సిజన్ ఉత్పత్తి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కోట్ల రూపాయల నిధులతో ప్లాంటును ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రాణవాయువు కొరత లేకుండా నిరంతరం సేవలందించేందుకు ఈ ప్లాంట్​ ఉపయోగపడుతుందన్నారు.

నెలరోజుల వ్యవధిలోనే ఆక్సిజన్​ ఉత్పత్తి కేంద్రాన్ని వినియోగించేందుకు సిద్ధం చేసిన అధికారుల కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

black fungus: అనంతలో 62.. చిత్తూరులో 53.. చాపకింద నీరులా ఫంగస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.