అనంతపురం జిల్లా గుత్తిలో ఇంటి అద్దె చెల్లించలేదని యజమాని.. అద్దెకున్న వారిపై దాడి చేశాడు. గుత్తి పట్టణం రైల్వే కాలనీలో గంగాధర్, కృష్ణవేణి దంపతులు అద్దె ఇంటో ఉంటున్నారు. ఇంటి యజమాని తిరుమల రెడ్డి ఇంటి అద్దె అడిగాడు. కరోనా నేపథ్యంలో కుటుంబ పరిస్థితులు బాగా లేవని.... లాక్ డౌన్ ముగిసిన తర్వాత అద్దె చెల్లిస్తామన్నారు. ఇంటి యజమాని అద్దె చెల్లించాల్సిదేనని పట్టుబట్టి వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో గంగాధర్, కృష్ణవేణి దంపతులకు గాయాలయ్యాయి. వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఆ కరోనా రోగికి ప్లాస్మా థెరపీ విజయవంతం!'