ETV Bharat / state

'ప్రజల భాగస్వామ్యంతోనే నగరాలు పరిశుభ్రం'

author img

By

Published : Feb 8, 2020, 1:43 PM IST

'మన అనంత-సుందర అనంత' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొని రోడ్లను పరిశుభ్రం చేశారు.

our anantha-  beautiful anantha
మన అనంత-సుందర అనంత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య

ప్రజల భాగస్వామ్యం లేకుండా నగరాలు పరిశుభ్రంగా ఉంచడం సాధ్యం కాదని అనంతపురం ఎంపీ, ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. 'మన అనంత- సుందర అనంత' కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. ఇందులో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుతో పాటు జిల్లా అధికారులంతా పాల్గొన్నారు. నగరంలో పాతూరు, మార్కెట్ ప్రాంతంలో రోడ్లను శుభ్రం చేశారు. నగరాన్ని సుందరంగా మార్చేందుకు ఈ కార్యక్రమంతో పాటు మరిన్ని నిధులు తీసుకొస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ సిబ్బందితో పాటు ప్రతిరోజు ఒక్కో విభాగం వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. బయట ప్రాంతాల్లో స్థిరపడ్డ అనంతవాసులు కూడా ఇందులో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ తాను చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని.. ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో నగరాన్ని సుందరంగా మార్చుతామన్నారు.

ఇవీ చదవండి...ఈ రైతును తేనెటీగలు కుట్టవు.. ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.