అనంతపురం జిల్లాలో పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాలు, గ్రామ సంరక్షణ కార్యదర్శులతో కలసి ఉదయం నుంచి ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హోటళ్లు, ఇటుకల పరిశ్రమలు, మెకానిక్ షెడ్లు, నిత్యావసర కూరగాయల దుకాణాలు, తదితర వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. బాలబాలికలను కార్మికులుగా ఉపయోగించుకొని, పనులు చేయించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇవీ చూడండి...