రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు - one person gets injured in road accident occured at penukonda
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. శివారెడ్డి అనే వ్యక్తి రోడ్డు దాటుతండగా... అటుగా ప్రయాణిస్తున్న ఎస్ఆర్ఎస్ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన శివారెడ్డి స్పృహతప్పి పడిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న రోడ్ సేఫ్టీ పోలీసులు క్షతగాత్రున్ని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు