ఆటో చోదకుడు ప్రమాదంలో చనిపోయిన ఘటన.. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే కాలనీలో చోటు చేసుకుంది. గుత్తి రైల్వే కాలనీకి చెందిన మల్లయ్య గత కొద్ది సంవత్సరాలుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. యథావిధిగా గుత్తి రైల్వే స్టేషన్ నుండి గుత్తికి వస్తుండగా మార్గ మధ్యలో ఆటో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. మల్లయ్య సృహ తప్పగా గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గ మధ్యలో మృతి చెంది ఉంటాడని నిర్ధరించారు. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ ఒక్కడే ఆటోలో ఉన్నట్టు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యుత్ స్తంభం పాక్షికంగా దెబ్బతిన్న కారణంగా.. పట్టణంలో కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ సంఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: