అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజు పల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని, కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. నాగరత్నమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ దంపతులు ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు.. ఆ వాహనాన్ని ఢీకొట్టిందని పామిడి సీఐ శ్యామ్ రావు తెలిపారు.
ఇదీ చదవండి: చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో.. ఆ తర్వాత అదృశ్యం