అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద వృద్ధ దంపతులు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన పోలీసులు వారి వద్ద నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. జిల్లాలోని ధర్మవరం మండలం, నడిమిగడ్డపల్లి గ్రామానికి చెందిన గంగమ్మ, పెద్దన్న అనే వృద్ధ దంపతులు తమకు చెందిన ఐదెకరాల భూమిని బంధువు ఆక్రమించారంటూ వాపోయారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూమి లేకపోతే తమకు జీవనాధారం లేదని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. లేకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని అంటున్నారు.
ఇదీ చదవండీ: