అనంతపురం జిల్లా ధర్మవరం సిద్దయ్యగుట్ట కాలనీకి చెందిన లక్ష్మీనారాయణ అనే వృద్ధుడు బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. లక్ష్మీనారాయణకు సంబంధించిన స్థలంలో అదే కాలనీకి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి అక్రమ నిర్మాణం చేపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మీనారాయణ అడ్డుపడటంతో శ్రీనివాసులుతో పాటు మరో ఇద్దరు యువకులు దాడి చేశారు. దీంతో కలత చెందిన లక్ష్మీనారాయణ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం లక్ష్మీనారాయణము కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కొత్తపేటలో కారు బోల్తా... ఒకరు మృతి