అనంతపురం జిల్లా మడకశిర మండలం మెలవాయి గ్రామానికి చెందిన న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు గోవింద్‌రెడ్డి (97)... కరోనా నుంచి కోలుకున్నారు. గత నెల 23న కరోనా లక్షణాలతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
చికిత్స అనంతరం కోలుకుని కరోనాను జయించి ఇంటికి తిరిగి వచ్చారు. ఈయనను ప్రముఖులు, సామాన్యులు తేడా లేకుండా.. అంతా అభినందించారు. కరోనా నిర్ధరణ అయితే ఎవ్వరూ భయపడకుండా గోవింద్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: