అనంతపురం జిల్లా కదిరి మండలంలో ఓ బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి వృద్ధుడు మాయమాటలు చెప్పి.. రాత్రి 8 గంటల సమయంలో పాఠశాల ఆవరణలోకి వెళ్లమన్నాడు. బాలిక వెళ్లిన అనంతరం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఇదీ చదవండి: లాలూకు బెయిల్- జైలు నుంచి విముక్తి!
రాత్రివేళ మనుషుల కదలికలు గుర్తించిన స్థానిక యువకులు.. పాఠాశాల ఆవరణలోనికి వెళ్లారు. వారిని చూసి వృద్ధుడు పారిపోయేందుకు యత్నించాడు. యువకులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు కదిరి డీఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు.
ఇదీ చదవండి: