ETV Bharat / state

No Response In Spandana Program: 'స్పందన'లో స్పందించని అధికారులు.. బాధితులకు తప్పని తిప్పలు - ఆంధ్రప్రదేశ్ వార్తలు

No Response In Spandana Program : సమస్యలు పరిష్కరించే వేదికగా సీఎం జగన్ గొప్పగా చెబుతున్న స్పందన కార్యక్రమం క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో స్పందనలో ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారం కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల అధికారుల బాధితులకు న్యాయం చేయటంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటంతో జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చి సమస్యలను ఏకరవుపెడుతున్నారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై కలెక్టర్, మండల స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చినా వాటని అమలు చేయటంలేదనే ఆరోపిస్తున్నారు..

Complaints _ Are_ Not_ Solved_ in_ Spandana_ Program

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 7:49 PM IST

No Response In Spandana Program : స్పందన కార్యక్రమంలో స్పందన కరవైందంటున్న బాధితులు ...

No Response In Spandana Program : అనంతపురం జిల్లా కలెక్టరేట్​లో నిర్వహిస్తున్న స్పందనతో బాధితుల సమస్యలు తీరటం లేదు. పదుల సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సమస్యలను పరిష్కరించకపోవటంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పేదల పట్టా స్థలాలను కూడా కబ్జాదారులు వదలటం లేదు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో దశాబ్దం క్రితం ఇల్లు నిర్మించుకున్న వారిపై బెదిరింపులకు దిగుతున్నా రెవెన్యూ అధికారులు చూస్తూ ఉంటున్నారే తప్ప.. పేదలకు అండగా నిలవలేకపోతున్నారు. విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు బాధితులకు న్యాయం చేయటంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటంతో జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చి సమస్యలను ఏకరవు పెడుతున్నారు. స్పందనలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా బాధితుల కష్టాలు మాత్రం తీరటం లేదు.

spandana program issues : క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం.. సమస్యలను పరిష్కరించే వేదికగా స్పందన కార్యక్రమాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం జిల్లా కలెక్టర్​కు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం ఏ విధంగా ఉందో స్పష్టమవుతోంది. అనేక వ్యయ ప్రయాసలకోర్చి బాధితులు జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతుండగా.. మండల స్థాయిలోకి వెళ్లేసరికి ఆదేశాలు అమలు కావటం లేదు.

Spandana Program: జగనన్నకు చెప్పినా కానరాని స్పందన.. పదే పదే మొరపెట్టుకున్నా ప్రతిఫలం లేదని ధ్వజం

Spandana Program Application : కబ్జాదారులు వదలటం లేదు.. అనంతపురం గ్రామీణ మండలం ఉప్పరపల్లిలో 13 ఏళ్ల క్రితం 145 మంది పేదలకు సెంటున్నర చొప్పున ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఈ స్థలాల్లో దాదాపు 25 మంది ఇల్లు నిర్మించుకున్నారు. ఈ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి ఆ స్థలంలో బోర్డు నాటాడు. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు దారి లేకుండా పెద్ద గొయ్యి తీశాడు. ఆ గుంత దాటి ఇంటికి వెళ్లలేని పరిస్థితితో బాధితుల్లో కొందరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అక్కడి ఇల్లు తప్ప వేరే గత్యంతరం లేని వారు తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే భూమి తనదేనని చెబుతున్న వ్యక్తి రెండు సార్లు ఇళ్లు కూల్చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారే తప్ప పరిష్కారం చేయటం లేదు.

No Response in Spandana: 'మా గోడు మరిచారు.. ఫోన్లలో నిమగ్నమయ్యారు'..అధికారులపై బాధితుల ఆగ్రహం

Spandana Andhra Pradesh : అధికారులు అక్రమార్కులకు అండగా.. మండల స్థాయిలో అధికారులు సమస్యలు పరిష్కరించకపోవటంతో బాధితులు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ వద్దకు వస్తున్నారు. మండల స్థాయిలో అన్నిశాఖల అధికారులు కూడా సోమవారం ప్రజా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాల్సి ఉంది. అయితే ఆ స్థాయిలో ఫిర్యాదులపై అధికారులు కనీసం స్పందించటం లేదు. మరికొన్ని చోట్ల కొందరు అధికారులు బాధితుల పక్షాన కాకుండా.. అక్రమార్కులకు అండగా నిలవడంతో జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించే స్పందనకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

spandana Complainants : చెప్పులరిగేలా తిరిగినా లాభం లేదు.. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్, మండల స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చినా వాటని అమలు చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రిలో శుద్ధనీటి జల ప్లాంటును నిర్వహించుకుంటున్న వారికి అధికారులే మూడో క్యాటగిరీ కింద విద్యుత్ కనెక్షన్ ఇచ్చి మీరు రెండో క్యాటగిరీకి చెందిన వారంటూ రూ. 2.80 లక్షల జరిమానా విధించారు. ఇద్దరు మినరల్ వాటర్ ప్లాంట్ యజమానులు చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా విద్యుత్ శాఖ నుంచి కనీస స్పందన లేకుండా పోయింది. ఎన్ని ఫిర్యాదులు చేసినా తమకు న్యాయం జరగటంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

spandana program issues: 'స్పందన' కరవు.. సమస్యలు పరిష్కరించండి మహాప్రభో..'

స్పందనతో అధికారుల స్పందన లేదని భావించిన ప్రభుత్వం జగనన్నకు చెబుదాం పెట్టారు. అయితే జగనన్నకు చెప్పినా మళ్లీ కలెక్టర్ వద్దకే తమ ఫిర్యాదు వస్తుందంటున్నారు. జిల్లా స్థాయిలోనే సమస్య పరిష్కరిస్తే జగనన్నకు చెప్పే అవసరం ఉండదని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.