అనంతపురంలో పేద ప్రజలకు, పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలిచింది నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్. లాక్డౌన్ మొదటి నుంచి పేదలకు నిత్యవసర వస్తువులు నగరంలోను, శివారు ప్రాంతాల్లోనూ ఇంటింటికీ సంస్థ నిర్వాహుకులు పంపిణీ చేస్తున్నారు.
ఇవాళ జేఎన్టీయూ కళాశాల సమీపంలోని 500 మంది పేదలు.. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ట్రస్ట్ నిర్వాహకురాలు నిర్మల మురళి.. సరకులు అందజేశారు. లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు పేద ప్రజలకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: