ETV Bharat / state

వెట్టిచాకిరి నుంచి బాలకార్మికులకు ఎన్​హెచ్​ఆర్సీ విముక్తి - ananthapur forced labour children news

ఇటుక బట్టీల్లో పనిచేస్తోన్న 32 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించింది జాతీయ మానవ హక్కుల కమిషన్​. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామంలో కూలీలుగా ఉన్న పిల్లలను గుర్తించిన బాలల సంరక్షణ విభాగం​​ ఛైర్​ పర్సన్​ రాజేశ్వరి వారిని చూసి చలించిపోయారు. దీనిపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్​ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వెట్టిచాకిరి నుంచి బాలకార్మికులకు ఎన్​హెచ్​ఆర్సీ విముక్తి
author img

By

Published : Nov 20, 2019, 5:16 AM IST

Updated : Nov 20, 2019, 8:02 AM IST

వెట్టిచాకిరి నుంచి బాలలకు విముక్తి

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామంలో ఇటుకల బట్టీల్లో పని చేస్తోన్న 32 మంది పిల్లలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ విముక్తి కల్పించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా బాలల సంరక్షణ విభాగం ఛైర్​ పర్సన్​ రాజేశ్వరి ఇటుకల బట్టీల వద్ద కూలీలుగా ఉన్న పిల్లలను చూసి చలించిపోయారు. ఇటుకల బట్టి యజమానితో పాటు బాల కార్మిక నిర్మూలన శాఖను పర్యవేక్షిస్తోన్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హక్కుల కమిషన్​ ఆదేశించింది. వారం రోజుల్లో ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని సర్కారుకు హుకుం జారీ చేసింది. ప్రస్తుతం పిల్లలను ఐసీడీఎస్​ ఆధ్వర్యంలోని బాలల సంరక్షణ శిబిరానికి తరలించారు. బాలలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఒడిశా రాష్ట్రానికి సురక్షితంగా చేర్చాలని కమిషన్​ సర్కారుకు సూచించింది.

ఇదీ చూడండి:

పరీక్ష రాయాలి... క్వాలిఫై అయితేనే బోటుకు లైసెన్స్..!

Intro:Body:

asdf

Conclusion:
Last Updated : Nov 20, 2019, 8:02 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.