రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ట్రస్టు బోర్డులను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఉత్తర్వులిచ్చింది. దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 135 ప్రకారం నూతన పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రస్టు బోర్డుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయించింది. తాజా ఉత్తర్వుల కారణంగా.... కాణిపాకం సహా రాష్ట్ర వ్యాప్తంగా 11 ఆలయాల్లో పాలక మండళ్లు రద్దయ్యాయి.
ఇదీ చదవండి