నష్టపోయిన పంటను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆగ్రహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎం.కొత్తూరు గ్రామానికి చెందిన రైతులు.. గ్రామ సచివాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అధిక వర్షాలకు తాము వేసిన వేరుశనగ పంట పూర్తిగా నష్టపోయామన్నారు.
ఈ వివరాలతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళనకు దిగారు. 5 వేల ఎకరాలకు పైగా వేరుశనగను సాగు చేసినా.. పది మందికి పైగా గ్రామ వాలంటీర్లు పనిచేస్తున్నా.. ఐదుగురు రైతుల పేర్లే పరిహారానికి అర్హులైనట్లు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: