ETV Bharat / state

murder attempt: లోక్​సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడిపై హత్యాయత్నం.. చేయించింది ఎవరు? - anantapuram district crime news

అనంతపురం జిల్లాలో లోక్​సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ బాబు (Lok Satta Party anantapuram district president Venkataramana)పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం(murder attempt) చేశారు. తనపై జరిగిన దాడి వైకాపా నేత కే మాధవ రెడ్డి కారణమని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

murder attempt:
murder attempt
author img

By

Published : Oct 27, 2021, 9:29 PM IST

లోక్ సత్తా పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ బాబుపై(Lok Satta Party anantapuram district president Venkataramana) బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం(murder attempt) చేశారు. రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీబజార్​లో ఆయనపై దాడి జరిగింది. అయితే.. తనపై వైకాపా జిల్లా అధికార ప్రతినిధి కె.మాధవరెడ్డి దాడి చేయించారని, కిరాయి గూండాలతో తనను హత్య చేయించేందుకు ప్రయత్నించారని వెంకటరమణ ఆరోపించారు.

రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీ బజార్లో ద్విచక్ర వాహనంలో వస్తుండగా.. పల్సర్ బైక్​లో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తన కళ్లలో కారంపొడి చల్లి దాడి చేశారని వెంకట రమణ తెలిపారు. కళ్లలో కారంపొడి పడడంతో ద్విచక్ర వాహనాన్ని ఆపి కళ్లు నలుపు కోవడానికి ప్రయత్నిస్తుండగా.. కర్రలతో దాడి చేసి పరారయ్యారని తెలిపాడు. దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆయనే దాడిచేయించారు..
పట్టణంలో వైకాపా నాయకుడు మాధవరెడ్డి.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టడంపై పత్రికల్లో కథనాలు వచ్చాయని వెంకటరమణ తెలిపారు. పత్రికల్లో కథనాలు రావడానికి తానే కారణమని భావించి, కిరాయి గుండాలతో తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోక్ సత్తా పార్టీ( Lok Satta Party) జిల్లా అధ్యక్షుడు వెంకటరమణను మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఫోన్లో పరామర్శించి.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

దాడికి నాకు ఏం సంబంధం లేదు..
లోక్​సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ బాబుపై హత్యాయత్నాన్ని వైకాపా నేత కే మాధవరెడ్డి ఖండించారు. వెంకటరమణ బాబుపై దాడి చేయాల్సిన అవసరం తనకు లేదని.. తన వైఖరి ఏంటో ప్రజలను అడిగి తెలుసుకోవాలన్నారు. వెంకటరమణపై పలు కేసులు ఉన్నాయని.. ఎవరో చేసిన దానికి తనను బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. ఆయన నివాసం ఉంటున్న ఇంటి సమీపంలోనే తాను కొత్త ఇల్లు నిర్మిస్తున్నామని.. ఆయనకు నాకు గతంలో కూడా ఎలాంటి గొడవలూ లేవన్నారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని.. అవసరమైతే దేవుడిపైన ప్రమాణం చేస్తానన్నారు.

ఇదీ చదవండి

FACEBOOK FRIENDSHIP: ప్రాణం మీదకు తెచ్చిన ఫేస్‌బుక్‌ పరిచయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.