అనంతపురం జిల్లా నార్పల మండలం గారబావి కొట్టాలకు చెందిన బండి నాగార్జున(32) అన్నావదినలతో కలిసి ఉండేవాడు. నాలుగు నెలల క్రితమే వివాహమైన నాగార్జునకు తన అన్నయ్యకు మధ్య ఆస్తి విషయమై తగదాలు వచ్చాయి. ఈ తగాదాలు ఎక్కువవ్వటంతో తమ్ముడిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు నాగార్జున అన్నావదినలు. మంచంపై పడుకొని ఉన్న నాగార్జునను ఇనుపరాడ్‌తో బలంగా మోదటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.
ఆస్తి వివాదం.. తమ్ముడిని హత్య చేసిన అన్న
కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాల వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆస్తి పంపకాలలో అన్నాతమ్ముళ్ల మధ్య జరిగిన గొడవను మనసులో ఉంచుకొని సొంత అన్నావదినలు కలిసి హత్య చేశారు.
అనంతపురం జిల్లా నార్పల మండలం గారబావి కొట్టాలకు చెందిన బండి నాగార్జున(32) అన్నావదినలతో కలిసి ఉండేవాడు. నాలుగు నెలల క్రితమే వివాహమైన నాగార్జునకు తన అన్నయ్యకు మధ్య ఆస్తి విషయమై తగదాలు వచ్చాయి. ఈ తగాదాలు ఎక్కువవ్వటంతో తమ్ముడిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు నాగార్జున అన్నావదినలు. మంచంపై పడుకొని ఉన్న నాగార్జునను ఇనుపరాడ్‌తో బలంగా మోదటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) వంట చెరుకు వినియోగాన్ని తగ్గించడంలో విప్లవాత్మక మార్పును గ్యాస్ సిలిండర్లు తీసుకువచ్చాయి. ఇప్పుడు ఆ ఒరవడిని కొనసాగించేలా సరికొత్త ఆలోచనతో గ్యాస్ ఇస్త్రీ పెట్టెలు మార్కెట్లోకి ప్రవేశించాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడిని తెచ్చేలా రూపొందించిన గ్యాస్ ఇస్త్రీ పెట్టెలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే కరెంటుతో పని చేసే ఇస్త్రీ పెట్టెలు ఉన్నా... వృత్తిరీత్యా ఇస్త్రీ చేసే వారికి మాత్రం గ్యాస్ తో పనిచేసే పెట్టెలు సౌకర్యవంతంగా ఉంటున్నాయి.
Body:బొగ్గు అవసరం లేదు.. కాలుష్యాన్ని పుట్టించే స్థాయిలో మంట పెట్టాల్సిన పని అంతకన్నా లేదు.. అసలు పొగలు కక్కకుండానే బట్టలకు సాఫీగా ఇస్త్రీ చేసేస్తున్నారు. బట్టల పై సర్రున జారి ఇస్త్రీ చేస్తున్న ఈ పెట్టకు వేడిని అందించేది కాలుష్యాన్ని వెదజల్లే బొగ్గు కాదు.. ఓ చిన్ని గ్యాస్ సిలిండర్ ఆధారంగా ఈ ఇస్త్రీ పెట్టే వేడెక్కుతోంది. అవును నిన్నటి వరకు వంటకు వినియోగించిన గ్యాస్ ఇప్పుడు ఈ బుల్లి ఇస్త్రీ పెట్టెలకు సైతం పనికొస్తుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ bpcl ఇటీవల విపణిలోకి ఈ ఇస్త్రీ పెట్టెలను ప్రవేశపెట్టింది. విశాఖలో భాస్కర్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ గ్యాస్ ఇస్త్రీ పెట్టెలు అందుబాటులో ఉంచారు.
బైట్: వెంకటరమణ భాస్కర్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు.
Conclusion:ఈ గ్యాస్ ఇస్త్రీ పెట్టె 6.5 కేజీల బరువు ఉంటుంది. వెనుక భాగంలో ఉండే మీటర్ ద్వారా అవసరానికి తగిన విధంగా వేడిని పెంచడం, తగ్గించడం చేసుకోవచ్చు. 5 కేజీల గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్, ట్యూబు అన్ని కలిపి కేవలం ఆరు వేల రూపాయలకు అందిస్తున్నారు. సాధారణంగా బొగ్గుతో పోల్చితే దీనిపై పెట్టుబడి కూడా తక్కువ అవుతుందని వినియోగిస్తున్న వారు చెబుతున్నారు. పని చేయడానికి ఎంతో సౌకర్యవంతంగా ఈ గ్యాస్ రేట్లు ఉన్నాయని అంటున్నారు.
బైట్: వినియోగదారిని.
Evo: ప్రస్తుతం విశాఖలో కొంతమంది వినియోగదారులు గ్యాస్ పెట్టేను వాడుతున్నారు. వీటి వినియోగం మరింత పెరిగితే వినియోగదారులు కాలుష్యం వెదజల్లే పొగ బారి నుంచి బయటపడవచ్చు.