స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావటంతో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 75 ఎంపీటీసీ స్థానాలకు గాను అభ్యుర్థులు పోటీ పడనున్నారు. అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేసేందుకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం చేరుకున్నారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఇప్పటివరకు శింగనమలలో 104 నామినేషన్లు దాఖలయ్యాయి.
అనంతపురంలో సజావుగా సాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
అనంతపురం జిల్లాలోని ఉరవకుండ, శింగనమల నియోజకవర్గాలలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావటంతో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 75 ఎంపీటీసీ స్థానాలకు గాను అభ్యుర్థులు పోటీ పడనున్నారు. అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేసేందుకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం చేరుకున్నారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఇప్పటివరకు శింగనమలలో 104 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇదీ చదవండి: తెదేపా వర్గీయులపై వైకాపా దాడి.. నామపత్రాలు చించివేత