అనంతపురం జిల్లా పెద్దపప్పురు మండలం ముచ్చుకోట వరదాయిపల్లి గ్రామ సమీపంలో ద్విచక్రవాహనానికి విద్యుదాఘాతం సంభవించి తల్లీ, కొడుకులు మృతి చెందారు. గ్రామం నుంచి కొండకు వెళ్తుండగా రహదారిలో తెగిపడి ఉన్న మెయిన్ విద్యుత్ తీగలను గమనించకుండా ద్విచక్రవాహనంపై అలాగే వెళ్లడంతో విద్యుదాఘాతంతో వెంకటలక్ష్మమ్మ(55), ఆమె కుమారుడు వెంకట స్వామిలు(36) అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు తరలించడానికి బంధువులు, గ్రామస్థులు నిరాకరించారు. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రజాపతినిధులు..
మృతుల కుటుంబాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. తక్షణ సాయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి రూ.10 వేలు అందజేశారు.
న్యాయం చేయాలని బంధువుల డిమాండ్..
మృతదేహాలు తరలించడానికి బంధువులు, గ్రామస్థులు నిరాకరించారు. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ అధికారులు మృతిచెందిన ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పడంతో మృతదేహాలను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరదాయిపల్లి గ్రామ సమీపంలోని తోటలకు వెళ్లే దారిలో ఉన్న విద్యుత్ స్థంభంపైకి ఎక్కిన ఉడుత కారణంగా విద్యుత్ తీగ తెగిపోయి కింద పడింది. ఈ విషయాన్ని గమనించకుండా ద్విచక్ర వాహనంపై వెళ్లడం వల్ల ప్రమాదం సంభవించింది. - ఏడీఈ రఘు
ఇదీ చదవండి : దుర్గగుడి అక్రమాల వ్యవహారంలో చర్యలు..