వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌ను వైకాపా కార్యాలయంలో తయారు చేశారని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. విజయసాయిరెడ్డి కనుసన్నలలో రూపుదిద్దుకున్న వీఎంఆర్డీఏ ప్రణాళికను రద్దుచేసి.. కొత్తది తయారు చేయాలని డిమాండ్ చేశారు. విధ్వంసకర మాస్టర్ ప్లాన్ వల్ల 30 వేల మధ్య తరగతి వారి ప్లాట్లు కనుమరుగవుతాయని మండిపడ్డారు. ఒకే రహదారికి ఒక్కో చోట ఒక్కో విస్తీర్ణం ఉండడం ఏంటని ప్రశ్నించారు. ప్రజామోదయోగ్యమైన ప్రణాళిక రూపొందించకుంటే.. న్యాయస్ధానాన్ని అశ్రయించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే వెలగపూడి హెచ్చరించారు.
ఇదీ చదవండీ.. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రావాలని శ్రీవారిని వేడుకున్నా: ఏపీఎన్జీవో అధ్యక్షుడు