అనంతపురం జిల్లా చెర్లోపల్లిలో లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆశా కార్యకర్తను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు.
ఈ ఘటనపై తెదేపా నేతలు హడావుడి చేస్తున్నారని..బాధితురాలి ఆరోగ్యం కుదుటపడినా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పరిటాల కుటుంబం ఇంకా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఆశా కార్యకర్తను వేధించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని.. చట్టం తన పని తాను చేస్తుందని తెలిపారు.
ఇదీచదవండి
వైకాపా నాయకులు లైంగికంగా వేధించారని... ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం