అనంతపురం జిల్లా మడకశిరలోని వైఎస్ఆర్ కూడలిలో.. 108, 104 అంబులెన్స్ వాహనాలను.. ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ప్రభుత్వం వీటిని కేటాయించింది. వీటిని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే... ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే
అందులో భాగంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో 108, 104 వాహనాలను అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు వాహనాలు కేటాయించామన్నారు. ప్రమాదం జరిగిన చోటు నుంచి సమాచారం అందిన పదిహేను నిమిషాల్లోనే 108 ఘటనాస్థలికి చేరుకుంటుందని వివరించారు. 104 వాహనం ప్రతి గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలకు వైద్య చికిత్సలు అందిస్తుందని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: