దివాకర్ ట్రావెల్స్ పత్రాలన్నీ నకిలీవే: ఎమ్మెల్యే పెద్దారెడ్డి - జేసీ దివాకర్‌కు షాక్ వార్తలు
జేసీ దివాకర్ రెడ్డి సోదరులపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. వారి ట్రాన్స్‌పోర్టు వ్యాపారమంతా.. ఫోర్జరీ సర్టిఫికెట్లతోనే నడుస్తోందని ఆరోపించారు. అందుకు సంబంధించిన కొన్ని నకళ్లను మీడియాకు చూపించారు. వారం రోజుల్లో కీలకమైన సమాచారంతో జేసీ సోదరుల అక్రమాలను బయటపెడతానని స్పష్టం చేశారు.
Mla Peddareddy allegations On Jc Brothers over diwakar travells
జేసీ దివాకర్ రెడ్డి సోదరులు ట్రాన్స్‌పోర్టు వ్యాపారమంతా ఫోర్జరీ సర్టిఫికెట్లతోనే నడుస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. అనంతపురంలో మాట్లాడిన ఆయన.. దివాకర్ ట్రావెల్స్ సంబంధించి ఎన్ఓసీ ధ్రువపత్రాలు, ఇతరత్రా పత్రాలన్నీ నకిలీవేనని చెప్పారు. అధికారుల సంతకాలతో మీ - సేవలో పొందినట్లుగా ఫోర్జరీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని, ఆ పత్రాలకు సంబంధించిన నకళ్లు మీడియాకు చూపించారు. ఇప్పటి వరకూ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమను ఎవరూ ఏమీ చేయలేరని అక్రమాలకు పాల్పడ్డారని, కానీ వారి ఆగడాలకు తాను అడ్డుకట్ట వేస్తానని హెచ్చరించారు. త్వరలోనే మరిన్ని ఆధారాలు బయటపెడతానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
TAGGED:
జేసీ దివాకర్‌కు షాక్ వార్తలు