ETV Bharat / state

కరవుతో రైతులు అల్లాడుతుంటే... భూముల వేలమా?: పయ్యావుల - mla payyavula keshav taza

రుణాలు చెల్లించలేదన్న కారణంతో రైతుల భూమలను వేలం వేయాలని పీఏసీఎస్ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

mla payyavula keshav
ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
author img

By

Published : Mar 15, 2021, 10:53 AM IST

అనంతపురం జిల్లాలో నాలుగైదేళ్లగా వరస కరువుతో పంటలు పండక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. పంట రుణాలను సకాలంలో చెల్లించలేదన్న కారణం చూపిస్తూ.. ఉరవకొండ మండలం లత్తవరానికి చెందిన 20 మంది రైతులకు చెందిన దాదాపు 60 ఎకరాల భూమిని.. పీఏసీఎస్ అధికారులు వేలం వేయడానికి సిద్ధమవటం దారుణమన్నారు.

ఈ నెల 15 నుంచి 23 వరకు ఆ ప్రక్రియను నిర్వహించడానికి ప్రకటనలు ఇవ్వడం, అందుకు ఏర్పాట్లు చేసుకోవడం బాధాకరమని చెప్పారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రుణాల చెల్లింపునకు రైతులకు మరింత సమయం ఇవ్వాలని ఆయన కోరారు. లేదంటే వేలాన్ని అడ్డుకోవడానికి వెనుకాడేది లేదని పయ్యావుల కేశవ్.. హెచ్చరించారు.

ఇదీ చదవండి:

సేవ్‌ తాడిపత్రి’ ఫలించిందా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.