వైకాపా ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తోందని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. లేపాక్షి మండలం సింగవరం గ్రామంలో రెండో రోడు ఆయన వర్షానికి తడిసి రంగు మారిన మొక్కజొన్న, ధాన్యాన్ని పరిశీలించి, రైతులు పరామర్శించారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు.. బాలయ్యతో మొరపెట్టుకున్నారు. ఈ క్రాప్ బుకింగ్‌లో అవినీతి తారస్థాయిలో జరిగిందని.. దళారులు, అధికారులు, ప్రభుత్వ పెద్దలు సిండికేట్‌గా ఏర్పడి రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఒక్క పాసుబుక్కు వెలుగులోకి వస్తే వారి అవినీతి భాగోతం బయటపడుతుందన్నారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోకపోతే ఢిల్లీ తరహాలో తెదేపా ఆధ్వర్యంలో రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇవీ చూడండి...