అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్న తరుణంలో.. నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ. 25లక్షలు విలువచేసే 2 వెంటిలేటర్లు, 100 పీపీఈ కిట్లు అందజేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో బాలకృష్ణ తరఫున వీటిని సూపరింటెండెంట్ కేశవులకు తెదేపా నాయకులు అందించారు.
లాక్ డౌన్ కారణంగా ఎమ్మెల్యే రాలేకపోయారని.. అయితే ఎప్పటికప్పుడు నియోజకవర్గ సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నారని నేతలు చెప్పారు. ఇప్పటికే బాలకృష్ణ ఆదేశాలమేరకు నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా కొవిడ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి.. వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ.. 15 మందికి గాయాలు