White color to Temple: కులమతాలకు అతీతంగా ఉన్న అనంతపురం జిల్లాలోని గూగూడు కుళ్లాయిస్వామి క్షేత్రానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రంగులను మార్పించారు. ఆలయానికి ఉన్న రంగులను మార్చి.. తెలుపు, బంగారం రంగులు వేయించారు. ఈ రంగులపై స్థానిక ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఉండే రంగులే వేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
MLA Jonnalagadda Padmavathi: కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలకోసం దేవదాయశాఖ వారు రూ.2.50 లక్షలు వెచ్చించి ఆలయానికి రంగులు వేయించారు. ఆ తరువాత రెండు రోజులకే ఎమ్మెల్యే తెల్ల రంగులను వేయించారు. ఎమ్మెల్యే తమకు సమాచారం ఇచ్చి రంగులను మార్పించారని, తన సొంత నిధులతో రంగులు వేయించారని ఆలయ ఈవో శోభ తెలిపారు.
ఇవీ చదవండి: