అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి(hindupuram district hospital)ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA nandamuri balakrishna) ఆకస్మిక తనిఖీ(rides) చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఆస్పత్రి పనితీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం(fire on feciliteis) వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆస్పత్రిలో సమస్యలు నెలకొన్నాయని బాలకృష్ణ మండిపడ్డారు. గతంలో ఎక్కువగా ఉండే ఓపీ... నేడు చాలా తక్కువ సంఖ్యకు పరిమితమైందని అన్నారు. వైకాపా పాలన(ycp rulling)లో రాష్ట్రం అంధకారంలో వెళ్లిపోయిందని ఆక్షేపించారు. సొంత ఖజానాలు నింపుకోవాలన్న ఆరాటమే తప్ప, అభివృద్ధి గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు.
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందట్లేదు. ఈ అంశంపై రోగుల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే ఇంత అధ్వానంగా పరిస్థితులు ఉంటే... ఇతర ఆస్పత్రులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాను. - నందమూరి బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే
ఇదీచదవండి.