బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిశారు. మార్చి 13, 14, 15 తేదీల్లో క్యాన్సర్‌పై అవగాహన, నివారణ మార్గాలపై నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాలని గవర్నర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. హైదరాబాద్ వేదికగా సాగనున్న ఈ మూడు రోజుల సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నట్టు సమాచారం.
ఇదీ చూడండి:
శాటిలైట్ రైల్వేస్టేషన్‌తో సరికొత్త అధ్యాయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి