అనంతపురంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. వైద్యులకు కూడా ఈ వైరస్ సోకుతోంది. ఈ నేపథ్యంలో వారి ఆందోళనలు తొలగించటానికి స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి రెడ్ జోన్లలో పర్యటించారు. ప్రజలకు భరోసా కల్పించారు. నగరపాలక సంస్థ అధికారులను వెంటబెట్టుకుని రసాయనాలు పిచికారీ చేయించారు. ఇప్పటికే నగరంలోని ఆరు కాలనీల్లో పోలీసులు రోడ్లకు అడ్డంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. ఎవరూ ఇంటి నుంచి రాకుండా ఉండటమే.. వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవటమని ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు.
ఇవీ చదవండి: