అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలో సరకు రవాణా రైలుకు ప్రమాదం తప్పింది. గుంతకల్లు నుంచి బెంగళూరుకు బియ్యం లోడుతో వెళుతున్న రైలు... నాగసముద్రం సమీపంలో ఒక్కసారిగా సాధారణ శబ్ధం కంటే భిన్నంగా కదిలింది. వెంటనే అప్రమత్తమైన రైలు గార్డు నాగేంద్రకుమార్ విషయాన్ని లోకో పైలెట్లకు చేరవేశాడు. చెన్నేకొత్తపల్లి సమీపంలో రైలు ఆపి గమనించారు.
ఓ బోగీ చక్రానికి ఉన్న బేరింగ్ దెబ్బతిన్నట్లు గుర్తించి విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. వారు రైలు వద్దకు చేరుకుని సిబ్బందితో మరమ్మతులు చేయించారు. మరో లోకో ఇంజిన్ రప్పించి కొన్ని బోగీలను ధర్మవరానికి, మరికొన్నింటిని పెనుకొండకు తరలించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా పుట్టపర్తి మీదుగా రైళ్లను మళ్లించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. వెంటనే అప్రమత్తమై సమాచారాన్ని చేరవేసిన గార్డును ఉన్నతాధికారులు అభినందించారు.
ఇదీ చదవండి: