అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్-19 క్వారంటైన్ కేంద్రాలను మంత్రి శంకర నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వలస కూలీలతో మాట్లాడి...కేంద్రంలోని సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో ఉండేవారికి సకాలంలో భోజనాలు అందేలా చూడాలన్నారు. వలస కూలీలు కేంద్రం విడిచి బయటకు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విడపనకల్ క్వారంటైన్ డాక్టర్ను సస్పెండ్ చేయాలని ఆ శాఖ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.