గత ఏడాదితో పోల్చితే ఈసారి వర్షాలు బాగా కురవడంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయని మంత్రి శంకరనారాయణ అన్నారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో 20 రోజుల ముందే ప్రాజెక్టు నిండిందని అన్నారు. హంద్రీనీవా ద్వారా మరిన్ని జిల్లాల్లో చెరువులను నింపుతామని చెప్పారు. నీటి విడుదల అనంతరం గ్రామస్థులతో కలిసి జీడిపల్లి గ్రామంలో పర్యటించారు.
ఇదీ చదవండి