మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం చాకర్లపల్లి గ్రామంలోని వైయస్సార్ కాలనీలో మంత్రి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ జగన్నాథ్ సింగ్, జేసీలు నిశాంత్ కుమార్, ప్రశాంతి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, సోమందేపల్లి తహసీల్దార్ అలెగ్జాండర్ పలువురు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...