అనంతపురం జిల్లా పెనుకొండ మండల కేంద్రంలోని కమాన్ వీధిలో రూ. 40 లక్షలతో మురుగు కాలువ, సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి శంకరనారాయణ.. శిలాఫలకం వేసి పనులు ప్రారంభించారు. అనంతరం వీధిలోని మురుగుకాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయనతో పాటు పెనుగొండ ఎంపీడీవో శివ శంకరప్ప, పంచాయతీరాజ్ డీఈ మురళి ఇతర అధికారులు, వైకాపా నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: