అనంతపురం నగర మేయర్ అభ్యర్థి పదవి ముస్లిం మైనార్టీలకు, డిప్యూటీ మేయర్ పదవి కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనంతపురంలో పది మున్సిపాలిటీల ఛైర్మన్లు, నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఖరారు చేయడానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు.
అనంతపురం జిల్లాలో 10 పురపాలికలకు ఛైర్మన్లను నిర్ణయించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాడిపత్రిలో ఎవరిని ప్రలోభాలు పెట్టడం లేదని స్పష్టం చేశారు.
నూతన కార్యవర్గం కొలువుదీరాక 15 శాతం ఆస్తిపన్ను పెంచేలా అనుమతించినట్లు బొత్స స్పష్టం చేశారు. 330 చదరపు అడుగుల ఇంటికి ఆస్తిపన్ను రూ.50 మాత్రమే ఉంటుందన్నారు. అనంతపురంలో గెలుపొందిన 48 మంది కార్పొరేటర్లతో బొత్స సమావేశం నిర్వహించి.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: రసవత్తరం.. తాడిపత్రి ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం