అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 347 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఈ పథకం నిర్వాహకులకు 2019 సెప్టెంబర్ నుంచి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది అప్పులు చేసి మెనూ పాటిస్తున్నారు. మడకశిర మండల ప్రభుత్వ పాఠశాలల ఏజెన్సీ వారికి సుమారు 2 కోట్ల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉంది. బకాయిలు చెల్లించడంలో మరింత ఆలస్యం అయితే మెనూ పాటించేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు బకాయి ఉన్న బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు. త్వరలో పెండింగ్లో ఉన్న బకాయిలు మొత్తం చెల్లిస్తామని మండల విద్యాధికారి తెలిపారు.
ఇవీ చదవండి.. బాతుల గుంపు... కనులకు ఇంపు..!