మెప్మాలో పనిచేస్తున్న టౌన్మిషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి... మహిళలు, రిసోర్స్ పర్సన్స్ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ... స్థానిక స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆందోళనకు దిగారు. అధికారి తీరును నిరసిస్తూ... కదిరిలో ధర్నా చేపట్టారు. మహిళలతో దురుసుగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు భాజపా, జనసేన నాయకులు మద్దతు పలికారు. దాదాపు 15 ఏళ్లుగా ఆర్పీలుగా పనిచేస్తున్న వారిని... శ్రీనివాస్ తొలగిస్తున్నారని మహిళలు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన వారినే ఆర్పీలుగా నియమించాలంటూ... అతన్ని ఆదేశించారని మహిళలు వాపోయారు.
ఇదీ చదవండి :