ETV Bharat / state

ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్​ మృతి... వైద్యుల నిర్లక్ష్యమే కారణమన్న కుటుంబీకులు - ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బరాయుడు మృతి వార్తలు

కరోనా సోకి అనంతపురం జిల్లా ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బారాయుడు మరణించాడు. కొవిడ్​ బారిన పడిన అతనికి.. ఆస్పత్రుల్లో పడక కేటాయించటంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బరాయుడు

author img

By

Published : May 17, 2021, 8:14 AM IST

అనంతపురం జిల్లా ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బారాయుడు కరోనాతో మృతి చెందారు. అత్యవసర పరిస్థితుల్లో నగరంలోని పలు ఆస్పత్రులకు వెళ్లినా… పడక కేటాయించటంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. చివరికి జిల్లాలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు.

సకాలంలో వైద్యం అందక మృతి చెందారని.. బంధువుల ఆరోపణల మేరకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు సుధాకర్, శ్రీధర్​లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆస్పత్రి పర్యవేక్షకుడు భాస్కర్​తో పాటు ఇద్దరు హెడ్ నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని… లేనిపక్షంలో చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ఆర్టీసీ బస్సుల్లో మొబైల్ ఆక్సిజన్ పడకలు: మంత్రి పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.