అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లికి చెందిన తెదేపా నాయకుడు సాంబకు మామిడి తోట ఉంది. దుండగులు.. ఆ తోటలోని మామిడి చెట్లను నరికి వేశారు. నాలుగు సంవత్సరాల వయసున్న 132 మామిడి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు కొడవలితో నరికారు.
విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న సాంబ... తాడిమర్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గ్రామంలో నెలకొన్న వర్గ పోరు వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడిమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: