ETV Bharat / state

అకాల వర్షం... ఆందోళనలో మామిడి రైతాంగం - unseasonal rain at kalyanadurgam latest news

అసలే ఆలస్యంగా వచ్చిన మామిడి పూత.. ఇప్పుడిప్పుడే పిందెలుగా మారుతున్న తరుణం. ఇంతలో.. అకస్మాత్తుగా వర్షం పడి.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మామిడి సాగు చేసిన రైతులను ఆందోళనలో ముంచెత్తింది.

mango farmers distress
అకాల వర్షం
author img

By

Published : Feb 19, 2021, 2:36 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. మామిడి పూత ఇప్పుడిప్పుడే పిందెలుగా మారుతున్న తరుణం కావటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుందుర్పి, కంబదూరు, శెట్టూరు మండలాల్లోని వేలాది మంది రైతులు మామిడి సాగు చేస్తున్నారు. ఈ వర్షం వల్ల పూత రాలిపోయి.. నష్టాలు వస్తాయని భయపడ్డుతున్నారు.

ఇప్పటికే మామిడి కాయలు కొనుగోలు చేసిన వ్యాపారస్తులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం పది రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇలా అకస్మాత్తుగా వర్షం పడటం వల్ల ఇతర పంటలకు కూడా చీడలు వ్యాపించి నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అంతర్వేది ఆలయ నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.